– ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత రాకుండా కృషి
– బోధనలో కార్పోరేట్ స్కూల్స్ తో పోటీ పదండి
– విద్యార్ధులను బావి పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మాత్రం గురువులదే
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
డ్రాప్ అవుట్స్ నివారించడంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు చొరవ తీసుకుంటేనే సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుచ్చిరెడ్డి పాళెం మండలం మినగల్లు, ఇందుకూరు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాకిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మినగల్లు ఏ ఆర్ ఆర్ హైస్కూల్ మరియు ఇందుకూరుపేట గునుపాటి రుక్మిణమ్మ, సుబ్బారెడ్డి హైస్కూళ్లలో విద్యార్ధినీ విద్యార్ధులకు విద్యా కిట్ల అందచేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆలనా పాలన మాత్రమే తల్లి తండ్రులు చేయగలరని వారిని పిల్లలను బావి పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మాత్రం గురువులదే నన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చదువుతో పాటు వారికి నైతిక విలువలను కూడా బోధించాలని కోరారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులతో కళ కళలాడాలని ఆకాంక్షించారు. కార్పోరేట్ పాఠశాలలతో పోటీ పడేలా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ళలో నైపుణ్యం గల ఉపాధ్యాయులతో పాటు అత్యుత్తమ బోధనా వసతులున్నాయని తల్లి తండ్రులకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యార్దినీ విద్యార్ధులతో కలిసి స్కూళ్ళలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలలోనికి వెళ్ళడం కాదు ఎన్నికల అనంతరం కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని స్థానిక నాయకులకు హితవు పలికారు.
మినగల్లు గ్రామంలో జరిగిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు, సర్పంచ్ పూజిత, బుచ్చి అర్బన్ రూరల్ మండలాల టిడిపి అధ్యక్షులు శేషయ్య, హరికృష్ణ, సీనియర్ నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం యాదవ్, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, శ్రీనివాసులు స్థానిక టిడిపి నాయకులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందుకూరుపేట గునుపాటి రుక్మిణమ్మ, సుబ్బారెడ్డి హైస్కూల్ లో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో డిఇఓ రామారావు, ఎంఇఓ నాయక్ లతో పాటు టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు వీరేంద్ర చౌదరి,టిడిపి మండల నాయకులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, చెంచుకిశోర్ యాదవ్, మునగాల రంగారావు, రామచంద్రయ్య, పవన్, ఇంతియాజ్,మధు, రాం ప్రసాద్, జనసేన నాయకులు జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.