నిత్యావసర సరుకుల పంపిణీ

కొల్లూరు, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనుమడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.