బాపట్ల, మహానాడు: కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్‌సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఐదు కేజీల గోధుమపిండి, ఒక కేజీ వంటనూనె ఇలా పది రకాల వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు , భట్టిప్రోలు మండలాలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం ముందుగా హెచ్చరించి అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు. వరద సమయంలో ఆహారం, మంచినీరు అందించాం. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.