మెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ

కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్

నేడు ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, ముండ్లమూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో ముండ్లమూరు మండలంలోని 20మంది పేద విద్యార్థులలో మెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్. వెంకట్ జెల్లెలమూడి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ల్యాప్ టాప్స్ ని స్పాన్సర్ చేశారు.

డాక్టర్ లలిత్ సాగర్ మాట్లాడుతూ…. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల కృషి అభినందనీయం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమినేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు ప్రదాత విద్యాదాత ప్రజా పాలకుడు నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో మనకు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి దేశ విదేశాలలో ఆంధ్ర రాష్ట్ర ఇంజనీర్లు రాణించేందుకు బాటలు వేసిన చంద్రబాబు తిరిగి రావాలని ఎన్నారైలు చేసిన కృషి మరువలేనిది. ఎన్నికల సమయంలో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ దేశాల నుండి కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆర్థిక సహాయాన్ని అందించి అఖండ విజయానికి ఎన్నారైలు చేసిన కృషి మరువలేనిది. దర్శి నియోజకవర్గంలో కూడా కూటమి విజయానికి ఎన్నారైలు కృషి చేశారని వారి కృషి మరువరానిదని కొనియాడారు.

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్నారైలు విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయం ..ఇందులో భాగంగా మన దర్శి నియోజకవర్గంలో ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన జల్లెల మూడీ వెంకట్ సొంత ప్రాంతం పై ఉన్న మమకారంతో జన్మభూమి రుణం తీర్చుకునేందుకు అమెరికాలో ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. ఆయనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి సౌజన్యంతో వెంకట్ ఈరోజు  మండలంలోని 20 మంది పేద విద్యార్థులకు అవసరమైన లాప్టాప్ లను పంపిణీ చేయడం గర్వకారణమని అభినందించారు. వెంకట్ ను స్ఫూర్తిగా తీసుకొని ఎన్నారై ఉద్యోగులు వ్యాపారులు తమ సొంత ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో విద్యార్థులకు విద్యాభివృద్ధికి వారి నైపుణ్యాభివృద్ధికి వారు ఉన్నత శిఖరాలు ఎదిగేందుకు తమ వంతు సహకారం అందించినట్లు వివరించారు.