వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా మిత్రులు ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. ప్రతి సంవత్సరంలాగనే ఈ ఏడాది కూడా జర్నలిస్టులకు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీలను వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలుపగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఫౌండేషన్ చొరవను అభినందించారు.