పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రి స్కూల్ కిట్లను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంతోపాటు తల్లుల ఆరోగ్యంపై అంగన్వాడీలు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సీడీపీఓ రుక్సానా బేగం, అంగన్వాడీ టీచర్లు, తెలుగుదేశం, జనసేన, బిజెపిల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు.