నులిపురుగుల నివారణ మందు పంపిణీ

నరసరావుపేట, మహానాడు: స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో విద్యార్థినివిద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు, ఆరోగ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.