చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ

పల్నాడు, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి 17వ వార్డులో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ బుధవారం జరిగింది. గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వారోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.