Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణ రాజముద్రను మార్పు చేయొద్దు

-కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించొద్దు
-తెలంగాణా ఉద్యమకారుడు, కార్మిక నేత పినపాక ప్రభాకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్లను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఆ రెండు చిహ్నాలను అందులో ఉంచాలని తెలంగాణ ఉద్యమకారుడు, షాద్‌ నగర్‌ కార్మిక నేత పినపాక ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం అని, ఒకప్పుడు వరంగల్‌ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం సర్వతో ముఖాభి వృద్ధికి తోడ్పాటును అందించించారని, ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయలకు గుర్తింపుగా కళాతోరణం నిలిచిందని గుర్తుచేశారు.

200 ఏళ్లు పాలించిన కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాల ఘన చరిత్ర, పాలన వైభవం అంతా కళాతోరణంలో పూసగుచ్చినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. కళాతోరణం తొలగింపుతో ఓరుగల్లుకు ఉన్న గొప్ప చారిత్రిక గుర్తింపు మాయం కావడంతో పాటు ప్రాధాన్యం తగ్గుతుం దని తెలిపారు. అలానే హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌ అని గుర్తు కొస్తుందని, గతంలో చార్మినార్‌కు 400 ఏళ్లు నిండిన సందర్భంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్సవాలు చేసిందని, ఈనాడు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం లోగో నుంచి తీసివే యటం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం అమరవీరుల స్థూపం, బతకమ్మ పెట్టాలనుకుంటే ఉన్న వాటిని తీయకుండా పెట్టవచ్చని చెప్పారు.