ఇంటి నుంచి బయటకు రావద్దు

– చిరంజీవి విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో ప్రజలకు ‘ఎక్స్’లో మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. “మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.