– దర్శి’ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి సలహాదారుగా పదవి వెలగబెట్టిన వ్యక్తి తో పాటు ఐపీఎస్ లు ఇలా…అందరూ కలిసి, వైద్యురాలు, నటి కాదంబరి జిత్వాని పై చేసిన సాముహిక దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని, సత్వరమే ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు.
ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం వెనకాల ఎవరు ఉన్నారు అనేది నిజ నిర్ధారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా… ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి… తోటి డాక్టర్ గా నాకు ఈ సంఘటన చాలా బాధ కలిగించింది… గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి… అన్నిటిపై సమగ్ర విచారణ జరిపి దోషులకు తగిన శిక్ష విధించాలని లక్ష్మి కోరారు.