– పొంగులేటి ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి
– మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి
– ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్
– కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు?
– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మహబూబాబాద్వెళ్లి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు.
అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మున్నేరుకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఆదివారం ఉదయం నాటికి 33 అడుగులు నీరు వచ్చింది. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది.
ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పని చేశామో ప్రజలకు తెలుసు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్ కు చుక్క నీరు రాలేదు.
నా హాస్పిటల్ కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. ఖమ్మం,పాలేరు నియోజకవర్గాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రజలే కాపాడుకున్నారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని 650 కోట్లు మంజూరు చేయించాను.
రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే
తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లకు వెళ్లి 36 గంటలు అయింది. మున్నేరు కు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపాలి.
కాంగ్రెస్ నేతలు మాపై దాడులు చేశారు. హైడ్రాను మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. దాడి చేసిన వారి పేర్లతో సహా సీపీకి ఫిర్యాదు చేశాము.
తుమ్మల మనుషులే మాపై దాడి చేశారు: ఎమ్మెల్యే ముఠా గోపాల్
ఖమ్మం లో నిన్న బీ ఆర్ ఎస్ నేతల పై దాడి కాంగ్రెస్ గుండాల పనే. ఇప్పటివరకు ఈ ఘటన కు సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు. ఖమ్మం లో కబ్జాలన్నీ కాంగ్రెస్ నేతల చలవే.సీఎం రేవంత్ కు దమ్ముంటే ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూల్చాలి. భౌతిక దాడులను ఎదుర్కునే సత్తా బీ ఆర్ ఎస్ కు ఉంది. వరద భాదితులను ఆదుకునే చర్యలు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గూండాయిజాన్ని ప్రోత్సహించడాన్ని ఖండిస్తున్నాం.
కొందరిని భయ పెట్టేందుకే ఈ దాడులు: ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
ఖమ్మం లో మా నేతల మీద కాంగ్రెస్ నేతల దాడులు గర్హనీయం. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన పది వేల సాయం ఏ మూలకు సరిపోదు. గోరంత సాయం చేసి కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా లో కొండంత సాయంగా ప్రచారం చేసుకుంటున్నారు.
పొంగులేటి ఈ ఘటన నిర్మాత..రేవంత్ రెడ్డి దర్శకత్వం: బాల్క సుమన్
ఖమ్మం లో నిన్న జరిగిన దాడి సీఎం రేవంత్ రెడ్డి దర్శకత్వం లో జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి ఈ ఘటన నిర్మాత. మమ్మల్ని చంపినా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాం. ఇప్పటి వరకు డీజీపీ ఈ ఘటన పై స్పందించలేదు. పోలీసులు అతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోము. సీఎం రేవంత్ ఖమ్మం లో కబ్జాల గురించి మాట్లాడుతున్నారు.
ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి నాగార్జున సాగర్ కెనాల్ ను ఆక్రమించి కట్టిన ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి. పొంగులేటి ఆక్రమణలు నిజమేనని అధికారుల బృందం నిర్ధారించింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల కబ్జా చిట్టా బయటపెడతాం. హైడ్రా పేరిట కొంత మందిని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేస్తున్నారు.