కడపలో కుక్కల దాడి!

– బెంబేలెత్తిపోతున్న ప్రజలు

కడప, మహానాడు: నగరంలో కుక్కల దాడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రామరాజు పల్లిలో కొద్దిరోజులుగా కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోమవారం అయిదేళ్ళ పాప ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కులు ఒక్కసారిగా దాడి చేసి, గాయపరిచాయి. దీంతో ఆ పాపను తల్లిదండ్రులు హుటాహుటిన రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.