బొటన వేలిని కొరికేసిన కుక్క

-తప్పించబోయిన మరో నలుగురిపై దాడి
-తీవ్రగాయాలతో ఆసుపత్రిలో క్షతగాత్రులు
-మంచిర్యాలలో దారుణం

తెలంగాణ: మంచిర్యాల సున్నంబట్టి వాడలో శుక్రవారం వీధి కుక్క వీరంగం సృష్టించింది. పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్లపల్లి ప్రసాద్‌ అనే వ్యక్తి చేతి బొటన వేలిని కొరికి పట్టుకోగా వేలు తెగిపోయింది. ఆ సమయం లో దానిని అడ్డుకోబోయిన మరో నలుగురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. కుక్కల నివారణకు మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.