అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు.
చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్ లో చేర్చాలని మంత్రికి విన్నవించారు.ఈ విషయంపై మంత్రి వెంటనే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో ఫోన్ లో మాట్లాడారు. పలువురు బీసీ సంఘం ప్రతినిధులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఏపీ స్టడీ సర్కిల్ సెంటర్లలో ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇప్పించాలని మంత్రిని కోరారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని మంత్రిని కోరారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.