-మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టాం. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నాం. ప్రజల కష్టాల్లో తోడుండే బి ఆర్ ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజల పక్షాన నిలబడింది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.