సీతానగరం: కాసాపేట గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి, టీడీపినేత తెంటు వెంకటప్పలనాయుడు తుఫాన్ బాధితుల కోసం 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అందజేశారు. నియోజకవర్గంలోని టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు.