జన్మదినోత్సవాలను పురస్కరించుకుని విరాళాలు

– మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం గోపాలపురం నియోజకవర్గం, ద్వారకా తిరుమల మండలం, మారంపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాసరావు, సునీత దంపతుల కుమారుడు భానుతేజ 16వ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన జన్మదిన సందర్భంగా రూ. 5వేలను విరాళంగా ప్రకటించారు. చెక్కును రామయ్యకి అందించారు.
– సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, నల్లచెరువు గ్రామానికి చెందిన జీఎం చలపతి నాయుడు కుమార్తె భావన తన 17వ జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.10 వేలను సీఎం సహాయ నిధికి వర్ల రామయ్యకి అందించారు.
– ఈ సందర్భంగా రామయ్య ఇరువురు కుటుంబాలను అభినందించారు. భానుతేజకు, జిఎం భావనలకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భాను తేజ కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు, సునీత, మోక్షశ్రీ, జిఎం భావన కుటుంబ సభ్యులు చలపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.