– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్
ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల కోసం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ప్రముఖులు కలిసి విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన కార్లపూడి వెంకటేశ్వర రావు శ్రీ కృష్ణవేణి చిల్లీస్ తరపున రూ.8,50,000 విరాళం అందించారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు కలిపి రూ.6,37,700, గుంతకల్లు కు చెందిన పి.ఈశ్వర్ కుమార్ రూ.5 లక్షలు, గుంతకల్లు కు చెందిన కంబారి కల్యాణ్ బాబు రూ. 3 లక్షలు, హైదరాబాద్ కు చెందిన గంగిశెట్టి అభినయ్ రూ.లక్ష, ఆదోని కి చెందిన ఆర్య చంద్ర శ్రీకాంత్ రెడ్డి రూ. లక్ష, చింతలపూడి కి చెందిన డాక్టర్ ఎం.శివకుమార్ హయగ్రీవ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రూ. 60 వేలు, గుంటూరు కు చెందిన శ్రీ సాయి దుర్గా ఎక్స్ పోర్ట్స్ తరపున లక్ష్మి రమా హరిత రూ. 50 వేల విరాళం అందించారు. దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.