– మంత్రి లోకేష్
అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. వరద బాధితుల సహాయార్థం ప్రీయూనిక్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ చిగురుపాటి రూ.15 లక్షలు, ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే రూ.10 లక్షల విరాళాన్ని మంత్రి లోకేష్ కు అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.