– మంత్రి లోకేష్ కు ప్రముఖుల విరాళాలు
అమరావతి, మహానాడు: వరద బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి విరాళాలు పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు గురువారం అందజేశారు.
విజయవాడకు చెందిన ప్రియ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత పి.శివకుమార్ రూ.10 లక్షలు, పలమనేరుకు చెందిన బి.సునీల్ రూ.10 లక్షలు, కాకినాడకు చెందిన సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ కాడ వెంకటరమణ రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన వైసీపీ నేత, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు రూ.5 లక్షలు, బద్వేలుకు చెందిన చెరుకూరి రవి కుమార్ రూ.5 లక్షలు, కడపకు చెందిన తేరకండ్ల కృష్ణారెడ్డి రూ.5 లక్షలు, కురుపాంకు చెందిన వైరిచర్ల విరేష్ చంద్రదేవ్ రూ.5 లక్షలు, విశాఖకు చెందిన ఐవీవై ఓవర్ సీస్ కన్సల్టెన్సీ అధినేత బి.రామ్ కుమార్ రూ.5 లక్షలు, కందుకూరుకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అధినేత కొల్లూరి కొండయ్య రూ.50 వేలు, కందుకూరు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.1.50 లక్షలు, తిరుపతికి చెందిన శ్రీ గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాని ఎన్.మాధవి రూ.2 లక్షలు, చింతలపూడికి చెందిన మద్దిపూడి శ్రీనివాసరావు చౌదరి రూ.1,35,136, విజయవాడకు చెందిన బొర్రా రాధాకృష్ణ రూ.లక్ష, అమలాపురానికి చెందిన మెట్ల రమణబాబు రూ.లక్ష, తిరుపతికి చెందిన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు రూ.1,16,700, గురజాల నియోజకవర్గం జానపాడుకు చెందిన వున్నం విజయ్ ఆధ్వర్యంలో డీడీసీ యూత్ వినాయకుడి లడ్డూవేలం పాట నగదు రూ.55 వేలు అందజేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబునాయుడును కలిసి విరాళం అందించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.