పెనమలూరు, మహానాడు : గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పరామర్శించారు. పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీవో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని, ఎంపీడీవో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన అదృశ్యానికి గల కారణాలు, ఇంకా ఇతర సమస్యలను తెలుసుకున్నారు. ఎంపీడీవో కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని, దిగులు పడవద్దని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు.