చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దు

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ లక్ష్మణ్ స్వామిని కోరారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో లక్ష్మణ్ స్వామితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రధానంగా రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, నిరుపేదలు మాత్రమే రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటారని, వారి పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించాలని, అటు ప్రజలకు, ఇటు చిరువ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సూచించారు.