గుంటూరు, మహానాడు: జిల్లాలో పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో వారధి అనే నూతన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ది ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చంటెన్స్ తెనాలి కల్యాణ మండపంలో వారధి కార్యక్రమం జరిగింది. తెనాలివన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ…. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించటమే వారధి ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
మహిళలు, విద్యార్ధులు సామాజిక మాధ్యమాల్లో తమ ఫొటోస్ ని పెట్టరాదని అపరిచితులకు తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వరాదని హెచ్చరించారు.
ప్రజలు అందరూ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండేలా చూసుకోవాలని, రోడ్డు యాక్సిడెంట్లు గురించి అవగాహన కల్పిస్తూ వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ శ్రీ నిశార్ బాషా, ఐటీ కోర్ సిబ్బంది, కల్యాణ మండపం పెద్దలు, ప్రజలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.