వైసీపీ రెచ్చగొట్టినా స్పందించొద్దు: నాగబాబు

అమరావతి: ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ట్విట్టర్‌లో నాగబాబు వీడియో రిలీజ్‌ చేశారు.