వైసీపీలో వారందరూ వెనుకకు రావాలి
సౌమ్యుడు జోగేశ్వరరావునే గెలిపించుకోవాలి
మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపు
మాదిగ, ఉప కులాలతో ఆత్మీయ సమావేశం
మండపేట, మహానాడు : దళితులను హింసించి శిరోముండనం చేసి కోర్టు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు దళితులంతా ఈ ఎన్నికల్లో తగిన శాస్త్రి చేయాలని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపునిచ్చారు. మండపేట సూర్య కన్వెన్షన్ హాలులో మండపేట నియోజకవర్గ మాదిగ, రెల్లి, ఇతర ఉపకులాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ సభాధ్యక్షతన వహించారు. ముఖ్యఅతిథి జవహర్ మాట్లాడుతూ తోట త్రిమూర్తులు వెంట ఉండి దళిత జాతి ద్రోహులుగా మిగిలిపోవద్దని వైసీపీలో దళిత నేతలకు సూచించారు. మండపేట అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు సౌమ్యుడని ఆయనను గెలిపించుకోవాలని కోరారు.
మండపేట కూటమి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ దళితులకు శిరోముందనం చేసిన వ్యక్తి కావాలా, అందరినీ కలుపుకు పోయే వ్యక్తి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు బుంగ సంజయ్ మాదిగ మాట్లాడుతూ దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారికి, శిరోముండనం చేసిన వారికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి దళితుల పట్ల తన వైఖరి వ్యక్తం చేశారన్నారు. బీసీ నేత కుక్కల రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పేదల రక్తాన్ని జలగలా పీలుస్తున్నాడన్నారు. బీజేపీ నేత కోన సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ నేత లీలా కృష్ణ మాట్లాడుతూ దళితులను గుండు కొట్టించిన తోట త్రిమూర్తులు ఇక్కడ నామినేషన్ వేయబోతున్నాడని, ఆయనను తరిమి తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దూళి జయరాజు మాదిగ మాట్లాడుతూ దళితులను మోకాళ్లపై నిలబెట్టిన దుర్మార్గపు చరిత్ర ఎమ్మెల్సీ తోటకు మాత్రమే ఉందన్నారు.
అనంతరం పలువురు యువకులు జవహర్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ను జవహర్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్ర కాష్, మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మందపల్లి దొరబాబు, చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, వేమగిరి మోషే, పెందుర్తి ప్రదీప్, జనసేన నాయకులు పైడిమళ్ల సతీష్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.