సోం డిస్టిలరీస్‌ బీర్‌ తాగి 65 మంది చచ్చింది తెలియదా?

-అందులో దిగ్విజయ్‌సింగ్‌ అవినీతికి పాల్పడలేదా?
-తెలంగాణలో రేవంత్‌ పర్మిషన్‌ ఇచ్చారా?
-ఇక్కడకు వస్తున్న విషయం జూపల్లికి తెలియదా?
-బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ప్రశ్నలు

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక పత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. కొత్త బ్రాండ్‌లకు అవకాశం ఇవ్వ లేదని చెబుతున్నారు. సోం డిస్టిలరీస్‌ కంపెనీ ద్వారా కొత్త బీర్‌ కంపెనీని తెలం గాణకు తీసుకువస్తున్నారు. సోం డిస్టిలరీస్‌లో కాంగ్రెస్‌ జాతీయ నేత దిగ్విజ య్‌సింగ్‌ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచింది. 2019లో కోటీ 31 లక్షలు ఆ కంపెనీ కాంగ్రెస్‌ పార్టీకి విరాళాలు ఇచ్చింది. 2013-14లో 25 లక్షల విరాళం ఇచ్చారు. సోం డిస్టిలరీస్‌ కార్యక్రమానికి దిగ్విజయ్‌ సింగ్‌ వెళ్లి వాళ్లను డబ్బులు సంపాదించి ఇవ్వాలని అడిగారు.

కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సోం డిస్టిలరీస్‌ సంస్థను సీజ్‌ చేశారు. దానిమీద అనేక సార్లు రైడ్స్‌ జరిగాయి. సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారా వు అబద్ధాలు చెబుతున్నారు. సోం డిస్టిలరీస్‌ కంపెనీ తెలంగాణకు వస్తున్న విష యం జూపల్లికి తెలుసా? సోం డిస్టిలరీస్‌ కంపెనీకి తెలంగాణలో బీర్లు అమ్మడానికి సీఎం రేవంత్‌రెడ్డి డీల్‌ చేసి పర్మిషన్‌ ఇచ్చారా? సోం డిస్టిలరీస్‌ కంపెనీ వల్ల మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు.