బడ్జెట్ సందర్బంగా పీఎం చిత్రపటానికి పాలాభిషేకం
అమరావతి, మహానాడు : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు వేల కోట్లు కేటాయించిన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి హోరెత్తించారు. ఈ సందర్బంగా మిట్టా వంశీ మాట్లాడుతూ యువతకు బడ్జెట్లో పెద్ద పీట వేశారన్నారు.
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి ప్రాధాన్యత ఇచ్చారన్నారు, దేశ సర్వతో ముఖాభివృద్దికి ఈ బడ్జెట్ సంకేతమని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బీజేపీ నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, బీజేపీ వైఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.