ఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర దర్శి కి చేరుకుంది. సోమవారం ఉదయం దర్శి పట్టణం, శివరజనగర్ లో మొదలైన ఆర్మీ ర్యాలీని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.

ఆర్మీ యాత్రకు చిహ్నంగా దర్శి లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా సైనికులతో కలిసి మొక్కలు నాటి దేశభక్తికి చిహ్నంగా వీరు చేస్తున్న యాత్ర యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థినివిద్యార్థులు ఆర్మీ ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.