ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

– హోం శాఖ కార్యదర్శిగా హరీష్‌గుప్తా
-గుంటూరు వాసికి డీజీపీ పదవి

అమరావతి: సీనియర్ ఐపిఎస్ అధికారి, ఆర్టీసీ చ్మైరన్ ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. వివాదరహిత అధికారిగా పేరున్న ద్వారకా తిరుమల రావు అందరి కంటే సీనియర్ అధికారి. 1989 బ్యాచ్‌కి చెందిన ద్వారకా నిజానికి ఎప్పుడో డీజీపీ కావలసి ఉంది. ఆయనకంటే జూనియర్ అయిన రాజేంద్రనాధ్‌రెడ్డికి డీజీపీ ఇచ్చిన జగన్.. ద్వారాకాకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు.

కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు సీనియారిటీని గౌరవించి, డీజీపీ ఇవ్వటం విశేషం. కాగా ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్‌గుప్తాను తిరిగి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సీఐడీ చీఫ్, విజయవాడ కమిషనర్‌గా వ్యవహరించిన ద్వారకా.. చంద్రబాబు ఏర్పాటుచేసిన సైబరాబాద్‌కు తొలి కమిషనర్‌గా పనిచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ద్వారకా తిరుమలరావు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో, ఒత్తిళ్లను ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.