Mahanaadu-Logo-PNG-Large

పల్లీలు తినండి..

వేరుశనగ జన్మ స్థలం దక్షిణ ఆఫ్రికా. ఇందులో విటమిన్ విటమిన్‌ కే, విటమిన్‌ ఈ, విటమిన్‌ బీ, సీ లుంటాయి. వీటిని కొందరు ఊరికే టైం పాస్ కి తింటూ వుండటం చేత వారికి తెలియకుండానే మంచి ఆరోగ్యం పొందిన వారు అవుతున్నారు.
ఒక గుప్పెడు పల్లీలు తింటే కోడిగుడ్డు, పాలు నుండి వచ్చే బలం కన్న అధిక బలం వస్తుందని తెలుసా ?

ఇది జీర్ణ శక్తిని పెంచి, రక్త హీనత తగ్గిస్తుందని రీసెర్చ్ లో ప్రూవ్ ఐంది కూడా.

పాలలో వుండే ప్రోటీన్స్, నేతిలో వుండే విటమిన్స్ ఇందులో వుండటం చేత ఇది అధిక బలం ఇస్తుంది.

వీటిలో క్యాన్సర్తో పోరాడే ఫైటో స్టరోల్స్ యెక్కువ వుండుట చేత క్యాన్సర్ నివారణలో ఉత్తమ ఔషధం గా కూడా రుజువు అయింది అమెరికా వాళ్ల ప్రయోగాల్లో. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ లో దీని నివారణ ప్రభావం అధికంగా వున్నటు తేలింది.
పీనట్స్ లో మ్యాంగనీస్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి.

ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి, మెటబాలిజంకు సహాయపడుతాయి. క్యాల్షియం గ్రహించడం మరియు బ్లడ్ షుగర్ రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి. పీనట్స్ తినడం వల్ల 21 శాతం డయాబెటిస్ రిస్క్ ఉండదని పరిశోధనల్లో కనుగొన్నారు.

ఇవి సంతాన సాఫల్యత ను యెక్కువ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో హై క్వాలిటీ ఫోలిక్ యాసిడ్ వుండటం వల్ల ఫెర్టిలిటీ రేట్ పెరిగి పిల్లలు అవయవ లోపాలు లేకుండా వుంటారు, అలాగే ప్రెగ్నెన్సీ మహిళలు వీటిని డైలీ కొంచెం తింటే అలెర్జీలు, ఆస్తమా లాంటివి రాకుండ వుంటాయి.

చర్మ సంరక్షణకు పీనట్స్ చాలా మంచిది. పీనట్స్ లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు రివర్ట్రోల్ చర్మానికి కావల్సిన తేమను అందించి, చర్మం తేమగా, కాంతివంతంగా మార్చుతుంది
దగ్గు, జలుబు ను నివారించే విటమిన్ c కూడా ఇందులో వుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు దీన్ని మితంగా తీసుకోవాలి. వేరుశెనగలు ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కల్గి వుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత మంచి హెల్తీ ఫుడ్ ను తింటూ వుండటం మనకే మేలు.
ఇంకే డౌట్స్ పెట్టుకోకుండా హాయిగా తినండి.

– పుల్లర్కాట్ దిలీప్