Mahanaadu-Logo-PNG-Large

అయోధ్య రామయ్యకు ఈటెల పూజలు

అయోధ్య: బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ గురువారం అవతారపురుషుడు, అయోధ్య రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి గోపాల్‌ జీని సన్మానించారు. అనంతరం గోపాల్‌ జీ కూడా ఈటెలను సన్మానించారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటే ల్‌, బీజేపీ నేతలు గిరివర్ధన్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, ఆనంద్‌ కృష్ణ, గంగాధర్‌ గౌడ్‌, తిరుపతి యాదవ్‌ పాల్గొన్నారు.