పవన్ ‘వారాహి’కి ఈసీ అనుమతి నిరాకరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి ఉపయోగించే ‘వారాహి’ వాహనానికి అనుమతి నిరాకరించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపాటి వాహనానికే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ రోడ్ షో లేకుండా నేరుగా హోటల్ నుంచి చేబ్రోలులో జనసేన ఏర్పాటు బహిరంగ సభకు వెళ్లనున్నారు.