మహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

చంద్రబాబు హయాంలో ప్రత్యేక స్థానం
రానున్న ఎన్నికలలో వారే కీలకం
కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు

కొత్తపేట, మహానాడు : మహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నాడు చంద్రబాబునాయుడు చేసిన కృషి వల్లే మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిరదని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో మహాలక్ష్మి రాజు ఫంక్షన్‌ హాలులో గురువారం జరిగిన మహిళల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు ఇంటికే పరిమితమైన మహిళలను అన్ని రంగాలలో ముందుంచి మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. ఈ ఎన్నికల్లో వారే కీలకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు(గబ్బర్‌ సింగ్‌), దుగ్గిరాల సుబ్బలక్ష్మి, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు సత్తిరాజు ఉషారా ణి, నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ కన్వీనర్‌ ముదునూరి పద్మావతి, మండల మహిళా అధ్యక్షురాలు సుధ, ఆత్రేయపురం సర్పంచ్‌ కరుటూరి విశ్వేశ్వరి, అంకంపాలెం ఉపసర్పంచ్‌ ఎస్‌.కుమారి, రమాదేవి, సరుకుల మహాలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.