వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కొత్త జడ్డవారిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ఢల్లీ, హైదరాబాద్, డెహ్రుడూన్, విజయవాడ, తిరుపతి, వినుకొండలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తూ ఎంతో మందిని కేంద్ర సర్వీసులలో ఎంపికయ్యేందుకు కృషిచేశారు.