ప్యారిస్, మహానాడు: జులై 26న పారిస్ లో ఆరంభమైన ఒలింపిక్స్ వచ్చేనెల ఆగస్ట్ 11 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్)లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు.