సీఐ నారాయణస్వామిపై ఎన్నికల కమిషన్‌ వేటు

హైకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు
ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం

అమరావతి: హైకోర్టు ఆదేశాలతో కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై సిట్‌ తో విచారణకు ఆదేశించింది. ఇతర పోలీసు అధికారులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్ష్యాలు సమర్పిస్తే విచారణకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. గుంటూరు రేంజ్‌ ఐజీ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌, కారంపూడి సీఐ నారాయణస్వామి లపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుపోవటాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అందులో భాగంగా నారాయణస్వామిపై వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.