– ఎన్నికల కమిషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు
– చంద్రబాబు వైరస్‌తో ఎన్నికల కమిషన్ ఇన్‌ఫెక్ట్ అయింది
– మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు
– మా పార్టీకి అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగాం
– వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంతో పొత్తులు
– సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు
– పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా…?
– ఈవీఎంలలో ఫలితాలు… ఊహాగానాలతో లాభమేంటి?
– వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ అవుతుందని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఎన్నికలలో పోలింగ్ రోజున టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు.
మొత్తంగా చూస్తే ఎన్నికల కమిషన్ అంపైర్ లాగా వ్యవహరించడం లేదని తెలిపారు. పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలీ, టీడీపీ, ఎల్లో మీడియా టెర్రిరిజం తదితర అంశాలకు సంబంధించి తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రానుందంటూ అమిత్ షా చేసిన కామెంట్లపై అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ బహుశా నార్త్‌లో వారికి కలిసి వస్తుందని అనుకుంటునా… సౌత్‌లో బ్యాలెన్సింగ్ అవుతుందని అక్కడి ఓట్ల కోసం కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయినా ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమైన తరువాత ఊహగానాలతో పని ఉండ దు. ఎన్నికల కమిషన్ ఏ గైడ్‌లైన్స్ ఇచ్చినా దేశమంతా ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన గైడ్‌లైన్స్‌పై ఇవాళ వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా అక్కడ కుట్ర జరుగుతోంది. ఎన్నికల కమిషన్ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలన్నదే మా ఆశ.
ఎన్డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకినట్లుగా ఉంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మాచర్లలో వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదు. ఎన్నికల్లో జరిగిన అన్ని ఘటనల వీడియోలు బయటపెట్టాలి. మాచర్ల ప్రాంతంలో టీడీపీ ఎందుకు రీ పోలింగ్ కోరడం లేదం టే..అక్కడ ఆ పార్టీ రిగ్గింగ్ చేసుకుంది. కక్షసాధింపుతో చంద్రబాబు రిమోంట్ కంట్రోల్‌గా ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుందన్న అను మానం ఖచ్చితంగా వస్తుంది. పోలీసులు మా వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారు. వాటిపై ఏం కేసులు పెట్టారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈసీ సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ సమయంలోనైనా ఈసీ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని మేం కోరుతున్నాం. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీని తప్పించాలని ప్రయత్నం గత రెండునెలలుగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.