– సీఎం బాబు, మంత్రి కొల్లు చిత్రపటాలకు క్షీరాభిషేకం
గుంటూరు మహానాడు: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెబ్‌ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం జీవోని జారీ చేయడంతో శనివారం రాష్ట్రవ్యాప్తం గా సెబ్ లో పనిచేస్తున్న సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం అనందంతో బాణసంచా కాల్చి, వారికి కృతజ్ఞతలు తెలిపారు. సెబ్ లో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అధికారాలు ఇవ్వలేదని ఆవేదనతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ డీసీ ఎస్‌వీవీఎన్ బాబాజీరావు, సిబ్బంది పాల్గొన్నారు.