ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని వివరించారు. జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. జూలై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌ జరగనుంది. జూలై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. జూలై 30 నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ జరగనుంది. ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.