ఇంజనీరింగ్ విద్యార్ధులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలను ఛైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన చక్రవర్తి, కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శంగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు.

దేశంలోని షార్, ఇస్రో వంటివి ప్రపంచంలో కీర్తిని తీసుకువచ్చాయని తెలిపారు. చంద్రయాన్ వంటివి ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవని, ప్రపంచంలో పాటు దేశంలో గ్లోబల్ వార్మింగ్ పెరిగిందని, విద్యార్ధులు ఇటువంటి సమస్యలపై దృష్టి నిలిపి పరిష్కారం చెపాల్సిన అవసరం ఉందన్నారు. మోటర్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అడవుల నరికివేత తదితర అంశాలను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇస్రో బృందం ఏర్పాటు చేసిన ప్యానల్స్ను జిల్లా ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.