పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం ట్రావెల్స్ బంగ్లా వద్ద అభయ ఫౌండేషన్ వారి సహకారంతో కారంగి అనిల్ ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ – మాకే నామ్” అనే ప్రధాని నరేంద్ర మోడీ నినాదంతో గుంటూరులో ఏపి రాజధాని నిర్మాణంలో పచ్చదనంతో మొదటి అడుగు అంటూ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు నేరేడు, గానుగా, దానిమ్మ, బాదం, సీతాఫలం వంటి మొక్కలను పంపిణీ చేసి, అనంతరం ఎమ్మెల్యే మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… మొక్కను అమ్మతో పోల్చారంటే వాటి విలువ ఏమిటో మనం గ్రహించాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లా దకరమైన భవిష్యత్తును అందించడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, ప్రకృతిలోని అన్ని ప్రాణులను రక్షించుకోవటం మనందరి బాధ్యత. ప్రకృతి పరిరక్షణకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగాలి.’’ అని గళ్ళా మాధవి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దిరాలి మ్యాని, డేగల ప్రభాకర్, లామ్ వర్ధన్ రావు, సుఖవాసి శ్రీనివాస్ రావు,శివ తదితరులు పాల్గొన్నారు.