23న ఈరోజుల్లో రీరిలీజ్‌

ఇప్ప‌డు రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే 2012, మార్చి 23న విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు మ‌ళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావ‌డం విశేషం. ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మ‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. గుడ్ సినిమా గ్రూప్‌ బ్యానర్ పై క్రియేటివ్ ద‌ర్శ‌కుడు
మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు.