– చర్యలు తీవ్రంగా ఉంటాయని హోం మంత్రి హెచ్చరిక
అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి అమెరికాలో ఉన్నట్టు ఏపీ అధికారులు గుర్తించారు. కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఘటనపై మెసేజ్ పంపినా కిరణ్ రెడ్డి స్పందించలేదని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్న హోంమంత్రి హెచ్చరించారు. కాగా, ఎసెన్షియా ఫార్మా యాజమాన్యంపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.