– అధికారులకు ఎమ్మెల్యే ఆనందబాబు ఆదేశం
బాపట్ల, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, కొల్లూరు దగ్గర గల అరవింద్ వారధి వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల దాటి వరద ప్రవహిస్తూ ఉండటంతో కొల్లూరు మండలం, భట్టిప్రోలు మండలం లోని లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శానిటైజేషన్ రేషన్ సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు.
ఈ రాత్రికి 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నందున వరద పెరిగితే లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ శ్రేణులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా క్యాడర్ మొత్తం గా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులంతా అలర్ట్ గా ఉండి ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని సూచించారు.