పడవలో సురక్షిత ప్రాంతానికి తరలింపు

కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. రాజధాని గ్రామం ఉద్దండరాయుని పాలెం లంక లో నివసిస్తున్న గృహస్థల వద్ద పడవలో వెళ్ళిన అధికారులు, సిబ్బంది.. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు తహశీల్దార్ జి.సుజాత, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.