ఎఫ్ ఆర్ బీఎం పరిమితి దాటినా కేంద్రం రూ. 35 వేల కోట్లు ఇచ్చిం

-రాష్ట్రాల అవసరాల దృష్ట్యా కేంద్రం నిధులు
-రూ. 25 వేల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డును నిర్మిస్తున్నది
-ఎంపీల సంఖ్యను బట్టి నిధుల కేటాయింపు జరగదు
-వచ్చే పార్లమెంటు సెషన్ లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం
-ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలుస్తాం
-బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు తీసుకోలేదని చేస్తున్న విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాల అవసరాల దృష్ట్యా కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కాంగ్రెస్ నాయకులు కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు.

తమ ఐడియాలు కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ బాగాలేదని వాళ్లే చెబుతున్నారు. అంటే వాళ్ల ఐడియాలు బాగోలేవనా? అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చామంటున్న విపక్షాలు.. తెలంగాణకు రూ. 40 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయం కాంగ్రెస్ మంత్రి భట్టి విక్రమార్క కూడా చెప్పారు.తెలంగాణకు ఎఫ్ ఆర్ బీఎం పరిమితి దాటినా, గత ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఇచ్చింది.

విద్యుత్, పెన్షన్ల వంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. రూ. 25 వేల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డును నిర్మిస్తున్నది.

రాష్ట్రంలో ఎంపీల సంఖ్యను బట్టి నిధుల కేటాయింపు జరగదు.గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మాదిరిగానే మిగతా రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి.

మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులను ఇతర పథకాలకు దారిమళ్లిస్తున్నాయి. MGNREGA స్కీమ్ కింద 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తోంది. కాని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మిగిలిన తమవాటా 10 శాతం నిధులను కూడా సరిగ్గా కేటాయించడం లేదు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 9,400 కోట్ల సర్వశిక్షా అభియాన్ నిధులు మురిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోవడంలో విఫలమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. స్వదేశీ స్పూర్తితో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దేశీయ ఉత్పత్తుల రూపకల్పనలో పెరుగుదలకు, సాంకేతికత, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను మరింత పెంచుకున్నాం.

ఇప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఎస్సీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరం. వక్ఫ్ బోర్డు బిల్లు అనేది ముస్లింలకు వ్యతిరేమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 12 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు సుమారు రూ. 10 లక్షల ఎకరాల భూమి ఉంది. కాని వీటితో దేశ వ్యాప్తంగా వచ్చే ఆమ్దాని రూ. 190 కోట్లే.

కొన్ని రాజకీయ పార్టీలతో వక్ఫ్ బోర్డును గుప్పిట్లో పెట్టుకుని పేద ముస్లింలకు అందాల్సిన నిధులు అందనివ్వడం లేదు. వక్ఫ్ బోర్డు అంశంపై జేపీసీ వేశారు. ఈ కమిటీలో డీకే అరుణ , ఎంపీ అసద్ ఉన్నారు. వచ్చే పార్లమెంటు సెషన్ లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందుతుంది. ముస్లింలకు లాభం జరుగుతుంది.

జుంటుపల్లి ప్రాజెక్టు గేట్లు గత ఐదేళ్ళుగా పనిచేయడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి మా ఒత్తిడితో తక్కువ ఖర్చుతో జుంటుపల్లి ప్రాజెక్టు గేట్లను రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతు చేయించింది. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలి. రాష్ట్రంలో స్కూల్ ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలుస్తాం.