– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన
విజయవాడ, మహానాడు: పలాస ప్రజలు ఛీ కొట్టినా సీదిరి అప్పలరాజు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. అప్పలరాజుకి మెడికల్ కండిషన్ సరిగా లేకనే మెడికల్ సీట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రిగా వెలగబెట్టిన అప్పలరాజుకి రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య ఎంతో తెలియదు, ఆయన మెడికల్ సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించారు తప్ప ఒక్కటైనా పూర్తి చేశారా? సగానికిపైగా కాలేజీల నిర్మాణం పునాది దశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది రాజమండ్రి కళాశాల ప్రారంభించారు. ప్రస్తుతం రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేవు. తాత్కాలిక భవనాల్లో తరగతులు నడపాలిన పరిస్థితి నెలకొంది. పులివెందుల వైద్య కళాశాలలో 48 శాతం బోధనా సిబ్బంది లేరు. జగన్ కి ప్రచార ఆర్భాటం తప్ప 5 ఏళ్ల లో ప్రజలకు చేసింది ఏమీ లేదు. అప్పలరాజు నోరు తగ్గించుకోకుంటే తిప్పలు తప్పవు.