-ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే
-తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు
మాచవరం మండలంలో ఉమ్మడి కూటమి సర్వసభ్య సమావేశం నిర్వహించిన గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా యరపతినేనిశ్రీనివాసరావు మాట్లాడుతూ…
151 సీట్లు ఉన్నాయని అధికార మదంతో ప్రజాస్వామ్యంపై దాడులు చేశారని… అందుకు ప్రతి చర్యగానే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టి తగిన గుణపాఠం చెప్పారన్నారు.
ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టారు. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని యరపతినేని అన్నారు.
పిన్నెల్లి గ్రామంలో నిన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల అద్దాలపై రాళ్లు వేసిన కూటమి కార్యకర్తలను యరపతినేని శ్రీనివాసరావు మందలించారు.
ఏదైనా సమస్యకి రాళ్లు వేసుకుంటేనో, విధ్వంసం సృష్టిస్తేనో పరిష్కారం కాదని… పాలక పక్షమైన ప్రతిపక్షమైన ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తే సహించేది లేదని తెలియజేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారు. మళ్లీ ఈ రోజున రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు.
గురజాల నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే నాకు తెలియజేస్తే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా నది నీటిని , అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పాఠశాల భవనాలు ఆస్పత్రులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.