చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు రాలేదు!

విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: ఎమ్మెల్యే జీవి

అమరావతి, మహానాడు :  మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన సిగ్గు రాలేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి నోరు తెరిస్తే అన్ని అసత్యాలు,అబద్ధాలు, గ్లోబల్ ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ట్విట్టర్లో టిడిపిపై చేస్తున్న విమర్శలు మానుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

కులాల సాంప్రదాయం తెచ్చింది జగన్ రెడ్డి అని అన్నారు. తిరుపతి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి, పెత్తనానికి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి ఇలా ఒకే సామాజిక వర్గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మిగిలిన సామాజిక వర్గాలకు మీరు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేశారు కాబట్టే ఎన్నికల్లో అన్ని వర్గాలు మీకు గుణపాఠం చెప్పారన్నారు.

విజయసాయిరెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన సిగ్గు రాలేదన్నారు. వివిధ కీలక పదవులు,నామినేటెడ్ పదవుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంటే విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఇలాంటి అసత్యాల ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.

పథకాలకు మహనీయుల పేర్లు

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు మంత్రి నారా లోకేష్ మహనీయుల పేర్లు నామకరణం చేయడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి అందజేస్తున్న పథకానికి “సర్వేపల్లి రాధాకృష్ణ” విద్యామిత్రగా, మధ్యాహ్న భోజన పథకానికి “డొక్కా సీతమ్మ” విద్యార్థులకు ప్రతిభా పురస్కారం పథకానికి ఏపీజే అబ్దుల్ కలాం ఇలా ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం గొప్పతనం అన్నారు.

జగన్ రెడ్డి గతంలో అన్ని సంక్షేమ పథకాలకు జగనన్న పేరు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. 1వ తేదీ పింఛన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తారని లబ్ధిదారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.